చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే లక్ష్మీనారాయణకు మా పార్టీలో స్థానం లేదు: విజయసాయిరెడ్డి

22-04-2019 Mon 17:53 | Andhra
  • కోవర్టు ఆపరేషన్ల కోసం వైసీపీలో చేరాలనుకుంటున్నారేమో
  • సీఎస్ ను ఇరికించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు
  • నాలుగు రోజుల్లో పోయేవారికి భయపడాల్సిన అవసరం లేదు
సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి  లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సీబీఐలాంటి సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు పాదాల వద్ద పెట్టిన వ్యక్తి దేశాన్ని మార్చాలని కలలు కంటున్నానని చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఆయనకు వైసీపీలో స్థానం లేదని చెప్పారు. కోవర్టు ఆపరేషన్ల కోసం వైసీపీలో ఆయన చేరాలనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను బలపరుస్తోందని విజయసాయి విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత మొత్తం ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఓటు వేసిన జనాలకు లేని అనుమానాలు చంద్రబాబుకు వస్తున్నాయని దుయ్యబట్టారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇరికించేందుకు బాబు అండ్ కంపెనీ ఒత్తిళ్లు మొదలు పెట్టిందని విజయసాయి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని సీఎస్ ను బెదిరిస్తున్నారని అన్నారు. నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకునేవారికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ChandrababuVijay Sai Reddychandrababulv subrahmanyamTelugudesamysrcplakshminarayanajanasena

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more